ఆర్టీసీ డ్రైవర్ అంత్యక్రియలపై ఉ‍త్కంఠ

31 Oct, 2019 16:11 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం బుధవారం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు వెళ్లి మృతి చెందిన డ్రైవర్‌ నంగునూరి బాబు అంత్యక్రియలపై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని గురువారం మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. మృతుడి ఇంటివద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంతో.. జిల్లాలోని ఆరెపల్లి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అరెస్ట్‌ చేసిన జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపేవరకూ.. మృతదేహాన్ని కదలనివ్వబోమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు.

చదవండి: ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం

మరిన్ని వార్తలు