అకాల దెబ్బ

10 Mar, 2015 03:23 IST|Sakshi

జగిత్యాల అగ్రికల్చర్/సారంగాపూర్ /మెట్‌పల్లిరూరల్: వర్షాభావంతో రైతులు అంతంతే సాగు చేయగా.. అకాల వర్షం ఆ పంటను సైతం తుడిచిపెట్టుకుపోరుుంది. జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఇప్పుడిప్పడే వస్తున్న మామిడి పిందెలు నేల రాలిపోగా.. మొక్కజొన్న పంట పాడరుుంది. పసుపును ఉడకబెట్టిన రైతుల కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు.

మామిడి రైతులు ఎకరాకు రూ.50 వేలు, మొక్కజొన్న రైతులు రూ.10 వేల చొప్పున పెట్టుబడిగా ఖర్చు చేశారు. పసుపును తవ్వి ఉడుకబెట్టి, ఆరబెడుతున్న సమయంలో వర్షం కురవడంతో నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బూజు రావడంతోపాటు పసుపులోని కుర్క్‌మిన్ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సారంగాపూర్‌లో గంటన్నర పాటు ఏకదాటిగా 42.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మండల కేంద్రంతోపాటు, రేచపల్లి, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేట, పెంబట్ల, కోనాపూర్,  పోతారం, బట్టపల్లి, లక్ష్మీదేవిపల్లి, బీర్‌పూర్, తుంగూర్, న ర్సింహులపల్లె, కొల్వాయి గ్రామాల్లోని మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. తహశీల్దార్ రాజమల్లయ్య, ఏవో తిరుపతినాయక్, ఆర్‌ఐలు విజయరంగారావు, శ్రీనివాస్ నష్టపోరుున పంటలు పరిశీలించారు. 

అకాల వర్షంతో రైతులు, అడ్తీవ్యాపారులు నష్టపోయూరు. 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెట్‌పల్లి వ్యవసాయమార్కెట్‌కు వచ్చిన సుమారు వెయ్యి క్వింటాళ్ల పసుపు వర్షంతో తడిసి ముద్దరుుంది. గిట్టుబాటు ధర కోసం కల్లాల్లోనే ఆరబెట్టిన పసుపు సైతం తడిసిపోరుుంది.  మండలంలోని కోనరావుపేటలో మామిడి పిందెలు నేలరాలారుు.
 
మరో మూడు రోజులు వర్షాలు
జగిత్యాల అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త మధుకర్‌రావు తెలిపారు. సముద్రజలాల మీద అప్పటికప్పుడే ఏర్పడిన ఉపరితల ద్రోణి తో అకాల వర్షాలు కురిశాయని చెప్పారు. పూణే నుంచి మంగళవారం పూర్తి సమాచారం అందనుందన్నారు.  
 
పలు మండలాల్లో వర్షపాతం ఇలా..
 జిల్లాలోని సారంగాపూర్‌లో 42.8 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్‌లో అత్యల్పంగా 1 మిల్లీమీటర్, ధర్మపురిలో 36.4, రామగుండంలో 27, జగిత్యాలలో 22, మెట్‌పల్లిలో 16, ముస్తాబాద్‌లో 13.2, గంభీరావుపేటలో 12.4, పెగడపల్లిలో 8.4, జూలపల్లిలో 5.8, సిరిసిల్లలో 5.2, సుల్తానాబాద్‌లో 3.2, గంగాధరలో 1.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.
 
వ్యాపారులను ఆదుకోవాలి
 మార్కెట్‌లో ఆరబోసుకున్న పసుపు వర్షం పాలైంది. దీంతో వ్యాపారులు నష్టపోయూరు. వ్యాపారులందరం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నందునా ఆదుకోవాలి. సకాలంలో స్పందించేందుకు తగిన కూలీలు, మార్కెట్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి                
 - నిమ్మల భూమారెడ్డి, అడ్తీ వ్యాపారి, మెట్‌పల్లి మార్కెట్

మరిన్ని వార్తలు