ఉపాధి‘హామీ’ గాలికి!

8 May, 2019 07:28 IST|Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరుగుతున్న పనులను సోమవారం ‘సాక్షి’ బృందం విజిట్‌ చేయగా.. కూలీలు పడుతున్న పలు ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. మండే ఎండల్లో పని చేసేందుకు వారు నానా అవస్థలు పడుతున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలేవీ కనిపించలేదు. పనులు జరుగుతున్న చోట దగ్గర టెంట్లు, తాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లే తాగుతున్నామని కూలీలు ‘సాక్షి’ ఎదుట వాపోయారు. ఇక ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వైద్యం వంటి సౌకర్యాల జాడే కానరాలేదు. చాలా మందికి పనులు కల్పించకపోవడం వల్ల కూడా వలసబాట పడుతున్నట్లు తెలిసింది.

ఆదిలాబాద్‌రూరల్‌: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు క్షేత్రస్థాయిలో వసతులు కరువయ్యాయి. రోజురోజుకూ జిల్లాలో ఎండలు మండుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు సేదతీరడానికి టార్పిన్లు అందించకపోవడంతో ఎండలోనే సేదతీరాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతీ సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు పంపిణీ చేస్తారు. కానీ ఈ ఏడాది వాటి పంపిణీ కూడా జరగకపోవడంతో ఏదైనా గాయమైతే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదికి సంబంధించిన పస్ట్‌ ఎయిడ్‌ బాక్సులను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నా.. అవి మాత్రం క్షేత్రస్థాయిలో ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా 2018–19లో కూలీలకు కనీస వేతనంగా రూ.205 అందించారు.

కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస వేతన కొలమానం ప్రకారం.. ఈ ఏడాది 2019–20 ప్రకారం కూలీలకు రోజు వారీ వేతనాన్ని మరో రూ.6 పెంచారు. కానీ నిధులు అందుబాటులో లేకపోవడంతో వాటిని కూడా సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. పెంచిన వేతనంతో జిల్లాలో లక్షలాది మందికి మేలు కలుగనుంది. జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 38 లక్షల పని దినాలను కల్పించారు. ఇందులో 6,550 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కూలీలకు ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.64 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సకాలంలో కూలీలకు డబ్బులు రాకపోవడంతో పనులకు సైతం వెళ్లేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదని కూలీలు పేర్కొంటున్నారు.

రెండు నెలల కూలి పెండింగ్‌..
ఎండల్లో పని చేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పనులు చేసి కూడా సకాలంలో డబ్బులు రాకపోతే తమ కుటుంబాలను పోషించుకేనేదేలా అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల నుంచి వేతనాలు రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొంతమంది కూలీలకు గతేడాది డిసెంబర్‌ నుంచి డబ్బులు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో 13 మండలల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా, రెండు నెలల నుంచి ఒక్కో మండలానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

కనీసం 40 దినాల పని లభించేనా..
ఉపాధి పనుల్లో జాబ్‌ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. హరిత హారం కోసం పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఎక్కువ పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో రోజుకు కనీసం రూ. 190 వేతనం వచ్చేలా చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా 2018–19లో జిల్లాలో కూలీలకు సగటు వేతనం 178 మాత్రమే అందింది.

పనికి వెళ్తున్న కూలీలు.. 63 వేల మంది..
వేసవిని దృష్టిలో ఉంచుకొని కూలీలు ఉదయం పూటనే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 63 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు లక్ష మంది కూలీలకు ఉపాధి కల్పిం చేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా ఇందులో 13 మండలలోని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పిస్తున్నారు.

లక్ష్యం నేరవేరేనా..
జిల్లాలో ఆయా మండలల్లోని ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో లక్ష మందికి రోజు కూలీ పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సకాలంలో డబ్బులు రాకపోవడంతో కూలీలు పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో వారి లక్ష్యం చేరడం కష్టంగా మారింది. 

డబ్బులు రాలేదు..
వడూర్‌లో ఉపాధి పనులు చేసిన. ఇప్పటికీ డబ్బులు రాలేదు. అధి కారులకు తెలిపినా పట్టించుకోవడంలేదు. కూలీలను ఆదుకుం టామని చెప్పే మాటలు మాటలకే పరిమితమైనాయి. అధికారులు స్పందించి కూలీలకు డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.   – సింగం పరమేశ్వర్, కూలీ, వడూర్‌

ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం
పనులు చేస్తున్న చోట నీళ్ల సరఫరా లేదు. తాగే నీళ్లను ఇంటి నుంచే తెచ్చుకోవాలని చెప్తున్నరు. నీళ్లకు డబ్బులు ఇస్తున్నామంటున్నారు కానీ అవి వస్తున్నాయో లేదో నాకు మాత్రం తెలియదు. మెడికల్‌ కిట్లు లేవు. ఎండ ఎక్కువగా ఉన్నందున కనీసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లైనా ఇస్తే బాగుంటుంది. నీడ కోసం టెంట్లు లేవు. సేదతీరాలంటే ఎక్కడైనా చెట్టు ఉంటే కొద్దిసేపు ఉంటున్నం లేకపోతే లేదు.– హెచ్‌కే రమేష్, కూలీ, చిట్యాల్‌బోరి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘డిజిటల్‌’ కిరికిరి! 

113 మందిపై అనర్హత వేటు 

టీఆర్‌ఎస్‌కు మావోయిస్టుల హెచ్చరిక

వివాదాస్పదంగా బిగ్‌బాస్‌ రియాలిటీ షో

ఏసీబీకి చిక్కిన ఐఐటీ టాప్‌ ర్యాంకర్‌

మున్సిపల్‌ ఓటర్ల జాబితా సిద్ధం

స్పెషలిస్టులు ఊస్టింగే?

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

పాత నోట్లు.. కొత్త పాట్లు!

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు! 

నిధుల సమీకరణపై దృష్టి!

పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు 

పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు 

బిగ్‌బాస్‌ ప్రసారం నిలిపివేయాలి

అయితే డొక్కు.. లేదా తుక్కు!

ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు!

మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!

ఎక్కడికైనా బదిలీ!

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం