విద్యార్థులకు అల్పాహారం అందజేత 

16 Feb, 2019 10:20 IST|Sakshi

దోమకొండ: విద్యార్థులు బాగా చదువుకుని 100శాతం ఫలితాలు సాధించాలని ప్రముఖ సినీ నటుడు రాంచరణ్‌తేజ సతీమణి ఉపాసన అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు గడికోట ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం అందజేసే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. గడికోట ట్రస్ట్‌ నుంచి పాఠశాలకు చెందిన 89మంది విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేస్తామన్నారు. పౌష్టికాహారం తమ ట్రస్ట్‌ నుంచి అందిస్తామని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల పేరుతో పాటు పుట్టిన ఊరి పేరును నిలబెట్టాలని ఆమె కోరారు. ఆమె వెంట జిల్లా విద్యాధికారి రాజు, ఏంఈవో సేవ్లానాయక్, సర్పంచ్‌ నల్లపు అంజలి, ఉపసర్పంచ్‌ గజవాడ శ్రీకాంత్, ఉపాధ్యాయులు నర్సింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గడికోట ట్రస్ట్‌ ప్రతినిధి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు