ఉర్దూ అధికారి పోస్టులకు 10న నోటిఫికేషన్‌

8 Mar, 2018 00:34 IST|Sakshi
మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుడు అబ్దుల్‌ఖయ్యూం ఖాన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ అధికారి ఉద్యో గాల భర్తీకి ఈ నెల 10న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు డు అబ్దుల్‌ ఖయ్యూం ఖాన్‌ తెలిపారు. బుధవారం నాంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉర్దూ అధికారి గ్రేడ్‌–1 విభా గంలో 6 పోస్టులు, గ్రేడ్‌–2 విభాగంలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

ఉర్దూ అధికారులు ఉర్దూ నుంచి ఆంగ్లం, తెలుగులోకి అనువాదం చేస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు.  ఉర్దూ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేస్తామన్నారు. ఉర్దూ లైబ్రరీలను అప్‌గ్రేడ్‌ చేస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మైనార్టీలకూ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ఏ షుకూర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు