అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం వద్దు 

23 Jul, 2018 02:16 IST|Sakshi

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మేనిఫెస్టో ప్రకటించాలి 

సీడబ్ల్యూసీ సమావేశంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రతిపాదన 

అనర్హత కేసు గురించి సంపత్‌ను ఆరా తీసిన రాహుల్‌     

సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఆలస్యం చేయొద్దని కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలంగాణ నేతలు సూచించారు. నామినేషన్‌ గడువు ముగిసే రెండు, మూడు రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుందని వివరించారు. ఇబ్బందులు లేని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వీలైనంత ముందే ఖరారు చేయాలని కోరారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, సీనియర్‌ నేతలు చిన్నారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరువాత మేనిఫె స్టోను ప్రకటించడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామనే విషయాన్ని వివరించామన్నారు. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల ఆలస్యం వల్ల గెలుపు అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందని చెప్పామన్నారు. ఎన్నికలకు ముందే ఐదు ప్రధాన హామీలను నిర్దేశించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు.

రైతు రుణమాఫీతోపాటు పంట బీమా కూడా ప్రకటించాలని కోరామన్నారు. పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేలా నిబంధనలను రూపొందించి మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పామన్నారు. మేనిఫెస్టోలో రైతులు, డ్వాక్రా సంఘాలకు ఆకర్షణీయ పథకాలను పొందుపరచాలని సూచించినట్లు పేర్కొ న్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా ఆ ఒప్పందాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన ఉండదని చెప్పారు. దీనిపై రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రస్తావించిన విషయం సరైందేనన్నారు. 

జన్మ ధన్యమైంది: సంపత్‌
సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలోకి ప్రవేశించిన రాహుల్‌కు సంపత్‌కుమార్‌ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యత్వ అనర్హత కేసు ఏమైందని అడిగారని సంపత్‌ చెప్పారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనను సీడబ్ల్యూసీ సమావేశానికి ఆహ్వానించడం, ఆ సమావేశంలో తాను పాల్గొనడం ఊహించలేదని, తన జన్మ ధన్యమైందని సంపత్‌ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని రాహుల్‌కు చెప్పానన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌లోకి మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌!

మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ఈనాటి ముఖ్యాంశాలు

'ప్రశ్నించే ప్రతిపక్షాన్ని గెలిపించాలి'

'రాష్ట్రమంతా హుజూర్‌నగర్‌ వైపే చూస్తోంది'

‘కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు’

ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట

ఆ మహిళా ఎమ్మెల్యేను ప్రగతి భవన్‌కు రానివ్వలేదు!

దారుణం: మూడు నెలల చిన్నారిని బండకేసి..

మెదక్‌ పర్యాటక ప్రాంతాలను చూద్దాం..విహరిద్దాం

కుక్కల దాడి: ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం

చినుకు పడితే ట్రిప్పు రద్దు

యాదాద్రిలో చిరంజీవి సతీమణి పూజలు

బుక్కిందంతా కక్కాల్సిందే 

నత్తనడకన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు

పర్యాటకులను కట్టిపడేసే అందాలు చూసొద్దాం..

ప్రైవేట్‌ రోడ్స్‌ @ 600కి.మీ

నల్గొండ అందాలు చూసొద్దామా !

డ్రోన్‌ కెమెరాలపై నిషేధం

స్పెషల్‌ కమిషనర్‌ సుజాత గుప్తా

అలుపెరగని ‘అధ్యాపకుడు’!

పెసర దళారుల్లో దడ 

రౌడీ సందడి

మిడ్‌మానేరుకు ఏమైంది..?

ఆదిలాబాద్‌ అందాలు.. కన్నులకు నయానానందం

ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణి అరెస్ట్‌ 

గర్భిణి ప్రాణం తీసిన కంచె

కాలం చెల్లినా.. రైట్‌రైట్‌

భారీ వర్షాలు, జీహెచ్‌ఎంసీ చర్యలు

హైదరాబాద్‌లో అతి భారీ వర్షం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!

సైరా ప్రమోషన్స్‌.. ముంబై వెళ్లిన చిరు

రేపే ‘సామజవరగమన’

అప్పటికీ ఇప్పటికీ అదే తేడా : రాజమౌళి

గ్రెటాకు థ్యాంక్స్‌.. ప్రియాంకపై విమర్శలు!

హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్‌..!