'అపుడు టీఆర్‌ఎస్‌ అంతు చూస్తాం'

27 Sep, 2017 14:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ మెట్రో రైలు తెలంగాణ ప్రజల సొత్తు అని, ప్రాజెక్టు పనులు చూసేందుకు వెళ్లిన తమ నాయకులను పోలీసులు అడ్డుకోవటమేమిటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2019 లో తమ సర్కార్ అధికారంలోకి వస్తుంది... అపుడు టీఆర్‌ఎస్‌ అంతు చూస్తామని హెచ్చరించారు. మెట్రోరైలు పనులు చూడ్డానికి పోలీసులకు అభ్యంతరం ఏమిటన్నారు. రూ.14 వేల కోట్లతో ప్రారంభమైన పనులు సీఎం కేసీఆర్ వైఖరితోనే ఆలస్యమయ్యాయన్నారు.

మూడేళ్లుగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఇందుకు కేసీఆర్‌, కేటీఆర్ లే కారణమని ఆరోపించారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్చాలనే కేసీఆర్ మొండిపట్టుదలతో ప్రజలపై మూడున్నర వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని చెప్పారు. మెట్రోరైలు ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు