బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు

16 Sep, 2019 12:20 IST|Sakshi
చింతలపాలెం : కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

సాక్షి, హుజూర్‌నగర్‌: కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించి, కొట్టించి, బెదిరించి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారని  టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం చింతలపాలెంలో కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీస్‌ స్టేషన్‌లను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ వారు గలీజు రాజకీయాలు పాల్పడుతున్నారన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిస్పందిస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

పులిచింతల ప్రాజెక్ట్‌ ముంపు బాధితులకు మెరుగైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతో ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్లను కట్టిచినం. దే«శంలో ఏరాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి పునరావాస కేంద్రాలు కట్టలేదని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా పులిచింతల బాదితులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక్క రూపాయి మంజూరు చేశాడా అని ప్రశ్నించారు. అటువంటి వారు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దుయ్యబట్టారు.  ఉప ఎన్నికలు.. మన ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికలన్నారు. హైకమాండ్‌ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తుందని. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తొలుత ఉత్తమ్‌ను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, నాయకులు చిలకల శ్రీనివాసరెడ్డి, మోర్తాల సీతారెడ్డి, కొట్టే సైదేశ్వరరావు, శాగంరెడ్డి గోవిందరెడ్డి, అరుణ్‌కుమార్‌ దేశ్‌ముఖ్, అల్లం ప్రభాకర్‌రెడ్డి, నర్సింహమూర్తి, తోట శేషు, ఇంద్రారెడ్డి, మంజూ నాయక్‌ నవీన్‌ నాయక్, మోతీలాల్, రామిరెడ్డి, పుల్లారెడ్డి, వీరారెడ్డి, కాశయ్య వివిద గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు