కేసీఆర్‌కు ఉత్తమ్‌ బహిరంగ లేఖ

4 Sep, 2017 18:56 IST|Sakshi
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులపై నిరంతరం కొనసాగుతున్న దాడులు, వేధింపులు, అక్రమాల గురించి అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుదనుకున్నాము. కానీ మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనగారిన వర్గాల వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో అణగారిన వర్గాలపైన జరుగుతున్న దాడులతోనే గుర్తింపు పొందేలా తయారైందని స్పష్టం చేశారు.
 
ఎన్నికల ముందు దళితుల కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వవపోవడమో కాకుండా కనీసం వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. రాష్ట్రంలో రోజు ఎక్కడో ఒక చోట అనగారిన వర్గాల వారిపై ఎదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు చేస్తున్న దురగాతాలతో రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లుగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో ఎక్కువగా గిరిజనులే ఉన్నారు. 
 
2014 నుంచి 2016 డిసెంబర్‌ నాటికి సెకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 1592 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోదక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 502 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. 120 హత్యలు జరిగాయి. మొత్తంగా అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ కేసులను పరిశీలస్తే 2016 డిసెంబర్‌ నాటికే 5210 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దళితులు ఆత్మస్థైర్యం కోల్పోయి బతుకీడుస్తున్నారు. వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి అనగారిన వర్గాలకు బతుకు భరోసా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాము. 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు