ఇది ప్రజా వ్యతిరేక చర్య: ఉత్తమ్ కుమార్

30 Mar, 2015 14:11 IST|Sakshi

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయమని, ప్రజా వ్యతిరేక చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
అన్నారు. బొగ్గు, ముడి చమురు ధరలు సగానికి పైగా తగ్గిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సబబు కాదని ఆయన సోమవారిమిక్కడ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, రూ.816 కోట్ల భారాన్ని సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తలు