బీసీలను బిచ్చగాళ్లనుకుంటున్నారా: వీహెచ్‌

15 Mar, 2017 02:47 IST|Sakshi
బీసీలను బిచ్చగాళ్లనుకుంటున్నారా: వీహెచ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇవ్వడానికి కేసీఆర్‌ దానకర్ణుడు.. బర్రెలు, గొర్రెలు తీసుకోవడానికి బీసీలు బిచ్చగాళ్లు అన్నట్టుగా చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్‌ పనిచేయదనే భయంతో బీసీలకు తాయి లాలను ఆశ చూపిస్తున్నారన్నారు. బర్రెలు, గొర్రెలు కాసుకుం టూ బీసీలు చదువుకోవద్దా అని ప్రశ్నించారు. మహిళలు ధైర్యంగా మాట్లాడాలని చెబుతున్న ఎంపీ కవిత.. ముందుగా కేబినెట్‌లో మహిళలకు అవకాశం ఇవ్వని కేసీఆర్‌ను ప్రశ్నించాలని సూచించారు.  

కేసీఆర్‌ ఇంటిలోనే అన్ని ఉద్యోగాలు: రవీంద్ర నాయక్‌
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారని మాజీ మంత్రి డి.రవీంద్రనాయక్‌ ఆరోపించారు. ప్రజల ను రెచ్చగొట్టి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తన కుటుం బంలోనే హరీశ్, కేటీఆర్‌లకు మంత్రి పదవులిచ్చారని, కుమార్తె కవితను ఎంపీని చేశారని అన్నారు. ఈ మేరకు 22 ప్రశ్నలతో కూడిన లేఖను కేసీఆర్‌కు రాశారు.

మరిన్ని వార్తలు