అధికారం తలకెక్కించుకోవద్దు

30 Mar, 2017 02:10 IST|Sakshi
అధికారం తలకెక్కించుకోవద్దు

మాజీ ఎంపీ వి.హనుమంతరావు
సాక్షి, హైదరాబాద్‌: అధికారాన్ని తలకు ఎక్కించుకోవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ నాయకు లకు, మంత్రులకు చెబుతున్నా.. ఆ విష యాన్ని ఆయన కుమారుడు కేటీఆర్‌కు చెబితే బాగుంటుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హితవు పలికారు. సీఎం కుమారుడైనంత మాత్రాన కేటీఆర్‌ ఏమైనా మాట్లాడవచ్చా అని బుధవారం ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయిం ట్‌ వద్ద విలేకరులతో మాట్లాడినంత మాత్రాన తనపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన వాళ్లను తరమికొట్టమని చెబుతారా అని మండి పడ్డారు. కాగా స్పీకర్‌ ఎస్‌.మధుసూదన చారితో వి.హనుమంతరావు బుధవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడకుండా పోలీసులు తనను అడ్డుకోవడం, ఆ తర్వాత దారి తీసిన పరిణామాల గురించి ఆయన వివరణనిచ్చారు.

మరిన్ని వార్తలు