‘కొత్త సచివాలయ నిర్మాణంపై ఓటింగ్‌’

24 Sep, 2017 20:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా, లేదా అనేదానిపై ఓటింగ్‌ పెడుగున్నట్టుగా మాజీ ఎంపీ వి. హనుమంతరావు చెప్పారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 26న(సెప్టెంబర్‌) ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలదాకా ఓటింగ్‌ను 20  కేంద్రాల్లో పెడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27న సోమాజిగూడలో ప్రజాభిప్రాయంపై కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ తన ముద్ర, పేరుతో పాటు వాస్తు పిచ్చితో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని వీహెచ్‌ చెప్పారు. కొత్త సచివాలయం ద్వారా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడమేనన్నారు. దీనిపై బ్యాలెట్‌ బాక్సుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పాలని ఆయన కోరారు. వాస్తు పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చెయోద్దని సీఎంను కోరారు. ఫలితాల తర్వాత అయినా సీఎం కేసీఆర్‌ ఆలోచనలో మార్పారావాలని వీహెచ్‌ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు