మంత్రి కేటీఆర్‌ను కలిసిన ‘వంగేటి’

27 Mar, 2018 12:16 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డి సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కె.తారకరామారావును మర్యాద పూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు మంత్రికి వంగేటి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా లక్ష్మారెడ్డికి కేటీఆర్‌ సూచించారు. 

మరిన్ని వార్తలు