నాడు రాళ్లతో కొట్టి. నేడు పూలతో ఆహ్వానమా.?

20 Mar, 2014 14:20 IST|Sakshi
నాడు రాళ్లతో కొట్టి. నేడు పూలతో ఆహ్వానమా.?

హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో నాడు మానుకోటలో రాళ్లతో కొట్టారు.. నేడు పూలదండలు వేసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఇలా చేర్చుకోవటం వలన టీఆర్‌ఎస్ పార్టీకి పవిత్రత వచ్చిందా? లేక ఆ పార్టీలోకి రావటం వలన కొండా దంపతులకు పవిత్రత చేకూరిందా? అని విరసం నేత డాక్టర్ పి.వరవరరావు ప్రశ్నించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘తెలంగాణ సాహిత్య చరిత్ర-పునర్నిర్మాణం’ అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఇలాగైతే మళ్లీ తిరుగుబాటు చేయక తప్పదని, విద్యార్థులు కూడా పోరాటాల్లో కీలకంగా ఉండాల్సి ఉంటుందని వరవరరావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పున ర్నిర్మాణం అన్న వారు కూడా ఆ అజెండానే  మరిచి..సీట్లు ఓట్లు వ్యవహారంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మూడు లక్షల మంది ఆదివాసీలకు చెందిన వందలాది గ్రామాలను కోల్పోవాల్సి రావడం సరి కాదన్నారు.

>
మరిన్ని వార్తలు