భర్తల భరతం పట్టిన భార్యలు

18 Mar, 2014 11:43 IST|Sakshi
భర్తల భరతం పట్టిన భార్యలు

ఖమ్మం : హోలీ సందర్భంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సౌమ్యాతండాలో గిరిజన సంప్రదాయ డూండ్ వేడుక అలరించింది. భర్తలకు వాతలు పడేలా భార్యలు కొట్టడమే ఈ వింత ఆచారం. డూండ్ అంటే వెతకటం అని అర్థం. గతేడాది హోలీకి, ఈ హోలీకి మధ్య  తండాలో పుట్టిన మగ పిల్లలను పండుగ రోజు తెల్లవారుజూమున 4 గంటలకు ఒకచోట గెరినీలు దాడి పెడతారు. (ఇక్కడ పురుషులను గేర్యాలు అని, స్త్రీలను గేరినీలని అంటారు). గేర్యాలు కర్రలు పట్టుకుని పిల్లలను వెదుకుతుంటారు.

పిల్లవాడు దొరకగానే గేర్యా, గేరినీలు కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. సాయంత్రం ఇంటి వద్ద ఒక స్తూపాన్ని (గుంజ) పిల్లవాడిని కట్టి, చుట్టూ తినుబండారులను గంగాళాల్లో (బకెట్లు) ఉంచి వాటిని తాళ్లతో కట్టి చుట్టూ గేరీనీలు (భార్యలు) కర్రలతో కాపలా ఉంటారు. వాటిని తీసుకెళ్లడానికి గేర్యాలు (భర్తలు) ప్రయత్నిస్తుంటే గేరినీలు కర్రలతో వారిని కొడుతూ... పాటలు పాడుతూ చుట్టు తిరుగుతారు. ఈ సమయంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. గేరినీలను చేధించుకొని ఆ గంగాళాలను ఎత్తుకొచ్చిన వారిని ధీరుడిగా గుర్తిస్తారు.

మరిన్ని వార్తలు