పెంచిన ఫీజులను ఉపసంహరించిన వాసవి కాలేజ్‌

2 Apr, 2018 22:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో వాసవి ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం దిగొచ్చింది. పెంచిన ఫీజులను ఉపసంహరించుకుంది. టీఎఫ్‌ఆర్‌సీ 2016-17 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులకు 86వేల ఫీజును నిర్ణయించినప్పటికీ, కాలేజ్‌ యాజమాన్యం  లక్ష అరవై వేలు చెల్లించాల్సిందిగా విద్యార్థులపై ఒత్తిడి పెంచింది. దీనికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు, తెలంగాణ పేరెంట్స్‌ అసోషియేషన్‌తో కలిసి ఆందోళనకు దిగారు. విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించి పేరెంట్స్‌తో పాటు నిరసనలో పాల్గొన్నారు.

తల్లిదండ్రుల, విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన కళాశాల యాజమాన్యం వారితో చర్చలు జరిపింది. పెంచిన 63వేల ఫీజును ఉపసంహరిస్తామని యాజమాన్యం తెలిపింది. నాలుగు సంవత్సరాల పాటు ఫీజులు కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయమని వారికి హామి ఇచ్చింది.

మరిన్ని వార్తలు