వీణా–వాణీల బాగోగులు ప్రభుత్వ బాధ్యతే

17 Jun, 2017 03:02 IST|Sakshi
వీణా–వాణీల బాగోగులు ప్రభుత్వ బాధ్యతే

స్టేట్‌హోంలో వీణా–వాణీలను కలసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న అవిభక్త కవలలు వీణా– వాణీలను శుక్రవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వీణా–వాణీల బాధ్యత ప్రభుత్వానిదే అని, వారికి అవసరమై న నిధులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు.

స్టేట్‌హోంకు వచ్చి ఆర్నెల్లు కావస్తోందని.. వారి బాగోగుల నిమిత్తం ఇప్పటివరకు రూ. 6.46 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఇందులో వారిని చూసుకునే ఆయాలకు రూ.4.32 లక్షలు, రూ.1.14 లక్షలు చదువుల కోసం, మరో రూ.లక్ష ప్రత్యేక కోటాలో అత్యవసర ఖర్చుల నిమిత్తం విడుదల చేశామన్నారు. వీణా–వాణీ గతేడాది ఐదో తరగతి చదివారని, వారి ఐక్యూ బాగుండ డంతో ఏడో తరగతికి ప్రమోట్‌ చేశామన్నారు.

మరిన్ని వార్తలు