భలే చౌక

2 Oct, 2018 09:20 IST|Sakshi

సగానికి తగ్గిన కూరగాయల ధరలు

స్థానిక మార్కెట్లకు పెరిగిన దిగుమతులు

శివారు జిల్లాల్లో భారీగా దిగుబడి

సాక్షి సిటీబ్యూరో: ఈ సీజన్‌లో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. గత పది రోజులుగా స్థానిక మార్కెట్లలో ధరలు సగానికి సగం తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సెప్టెంబర్‌ మొదటి వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఆగస్టు నుంచే శివారు జిల్లాల నుంచి భారీగా కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం చాలా రకాలు కిలో రూ.35–40 లోపే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. టమాటా ధర కొన్ని నెలలుగా రూ.10 మాత్రమే ఉండడం గమనార్హం.

శివారు జిల్లాల్లో పెరిగిన దిగుబడి
సాధారణంగా ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ మాసాలను అన్‌సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో  ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. అందువల్లే రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి శివారు జిల్లాల్లో కూరగాయల సాగు అధికమై దిగుమతులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నిజామాబాద్‌ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మోతాదులో నగరంలోని బోయిన్‌పల్లి, గడిమల్కాపూర్, ఎల్‌బీనగర్, మెహిదీట్నం, కొత్తపేట తదితర మార్కెట్లకు కూరగాయలు భారీగా తరలిస్తున్నారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ సీజన్‌కు ముందు ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.60 పైనే ఉండేవి కానీ. గత పది రోజులుగా పచ్చిమిర్చి, బీన్స్, దొండ, బెండ, ఆలుగడ్డ, టమాటా, వంకాల తదితర కూరగాయలు రూ.40 లోపే లభిస్తున్నాయి. దుర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ. 40 లోపే ఉన్నాయి.

మరిన్ని వార్తలు