వాహనాల దొంగ అరెస్ట్

15 Dec, 2015 15:19 IST|Sakshi

వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీసులు ఓ వాహనాల దొంగను అరెస్ట్ చేశారు. జిల్లాలోని గుర్రప్పాడుకు చెందిన పల్లకొండ దేవేందర్ వరంగల్‌కు వస్తుండగా మంగళవారం ఉదయం ములుగు క్రాస్‌రోడ్డులో హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగతనం చేసిన  10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


 

మరిన్ని వార్తలు