విధ్వంసకర నిరసనలు మంచి పద్ధతి కాదు

30 Dec, 2019 03:14 IST|Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, హైదరాబాద్‌: విధ్వంసకర, వినాశకర పద్ధతుల్లో నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య దేవాలయమైన భారత్‌కు మంచిది కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశం ఆయన చూపిన అహింసా మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ప్రజా ఉద్యమాల్లో హింసకు తావివ్వ రాదని, అర్థవంతమైన చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు.

ఆదివారం శిల్పకళావేదికలో నిర్వహించిన మాజీ గవర్నర్, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి శత జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన వెంకయ్య, వివిధ అంశాలపై భిన్న అభిప్రా యాలు తప్పుకాదని, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సరైన సమాధానమివ్వడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ,  మాజీ గవర్నర్‌ రోశయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు