ఆదర్శ గ్రామంగా వన్నెల్‌(బి)

21 Jul, 2018 13:10 IST|Sakshi
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న సీపీ కార్తికేయ 

బాల్కొండ నిజామాబాద్‌ : నేరాల నియంత్రణకు పోలీసులతో సహకరించడంలో మండలంలోని వన్నెల్‌(బి) గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని సీపీ కార్తికేయ అన్నారు. గ్రామస్తులు రూ.2.7 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్మూర్‌ డివిజన్‌లో నేరాల నియంత్రణ కోసం గ్రామస్తులే స్వంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో వన్నెల్‌(బి) ముందుందన్నారు.

సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో ప్రజలు అందరూ పోలీసులతో సహకరించాలన్నారు. అప్పుడే నేర రహిత సమాజం  ఏర్పడుతుందన్నారు. సీసీ కెమెరాలతో అనేక ప్రయోజనలు ఉన్నాయని వివరించారు. కోర్టుల్లో పోలీసులు ప్రవేశపెడుతున్న సాక్ష్యాలకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇతర గ్రామాల్లో కూడా వన్నెల్‌(బి) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని  సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు.

గ్రామస్తులను చైతన్యవంతులు చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేల కృషి చేసిన బాల్కొండ ఎస్‌ఐ స్వామీగౌడ్‌ను, గ్రామస్తులను అభినందించారు.  కార్యక్రమంలో ఆర్మూర్‌ ఏసీపీ శివకుమార్, ఆర్మూర్‌ రూరల్‌ సీఐ రమణరెడ్డి, స్థానిక సర్పంచ్‌ తాళ్ల భూషణ్, ఎంపీటీసీ రాజు,  బాల్కొండ సహకార సంఘం అధ్యక్షుడు తూర్పు రమేశ్‌రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.  

కమ్యూనికేషన్‌ కార్యాలయం ప్రారంభం 

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): జిల్లా కేంద్రంలోని పోలీస్‌లైన్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ కార్యాలయాన్ని శుక్రవారం సీపీ కార్తికేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని సిబ్బంది చక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

నూతన భవనంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ సామగ్రి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని చక్కగా వినియోగిస్తూ నేరాల నియంత్రణ కోసం వాడాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ఎన్‌ఐబీ, ఏఆర్‌ ఏసీపీలు సీహెచ్‌ మహేశ్వర్, రవీందర్, ఎస్‌బీ సీఐ రాజశేఖర్, ఆర్‌ఐ శేఖర్, శైలేందర్, రాంనిరంజన్, కమ్యూనికేషన్, ఎస్‌ఐలు నవీన్‌కుమార్, ఆర్‌ చంద్రబోస్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు