ఇంత నిర్లక్ష్యమా?

11 Jun, 2017 03:36 IST|Sakshi
- చితికి నిప్పంటించకముందే  వెళ్లిపోతారా?
మంత్రి, అధికారులపై వీహెచ్‌ మండిపాటు 
 
చండూరు/మునుగోడు: ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి అంత్యక్రియల్లో  అధికార పార్టీ నాయకులు, అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్‌ నేత వి.హనుమంత్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇడికుడలో పాల్వాయి పార్థివదేహానికి చితి అంటిం చక ముందే అధికారులు అందరు వెనుదిరగడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చితిని అంటించేందుకు కేవలం ఒక లీటర్‌ కిరో సిన్‌ మాత్రమే తేవడం ఏమిటని, స్థానిక తహసీ ల్దార్, సీఐలు ఎక్కడా ఉన్నారని ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీ నాయకుడు మృతిచెందితే ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తారా అని అక్కడ ఉన్న నల్లగొండ ఆర్‌డీఓ వెంకటాచారిని నిలదీశారు. అంత్యక్రియలకు హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చితికి నిప్పంటించకముందే ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. 
 
మరిన్ని వార్తలు