కేసీఆర్ అహంకారం సగం తగ్గింది : వీహెచ్‌

27 May, 2019 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇంతవరకు బాధితకుటుంబాలను ప్రభుత్వం పరామర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ మండిపడ్డారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ తన నియోజక వర్గంలో కార్యకర్త చనిపోతే వెళ్లి పాడే మోసిందని గుర్తు చేశారు. మరి, నీకు ఓట్లు వేసిన హజీపూర్ ప్రజలకు నువ్వు ఏం చేశావంటూ కేసీఆర్‌పై వీహెచ్‌ ధ్వజమెత్తారు. 

ఇంటర్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌కు ఎలాంటి బాధ లేదన్నారు. ఫలితాలతో కేసీఆర్‌కు అహంకారం సగం తగ్గిందన్నారు. కేసీఆర్‌కు గర్వం పూర్తిగా తగ్గించాలని తిరుపతి దేవుడిని మొక్కుతున్నానని తెలిపారు. వారం లోపు కేసీఆర్ హజీపూర్‌కు వెళ్లి అక్కడ బాధితులను ఆదుకోవాలని, లేకపోతే మరోసారి ఆ ఊరికి వెళ్లి రోజంతా దీక్ష చేస్తానని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు