-

మానవత్వం చాటిన వియ్‌ ఫర్‌ ఆర్పాన్‌

3 Apr, 2020 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాన్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేదలు, దినసరి కూలీల పరిస్థితి దీనంగా మారింది. చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక బాధ పడుతున్నారు. మరోవైపు అత్యవసర ఇబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ పలు స్వచ్ఛంద సంస్థలు అన్నపానీయాలు సమకూరుస్తున్నాయి. తెలంగాణలో సేవలు అందిస్తున్న వియ్‌ ఫర్‌ ఆర్పాన్‌ ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో తమ వంతు సాయం చేశారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, రోడ్డుపై ఉన్న పేదలు, దినసరి కూలీలకు అల్పాహారం, మంచినీళ్లు అందించి మానవత్వం చాటుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ అనుమతి తీసుకుని సీహెచ్‌ రాజేశ్‌, జైహింద్‌, రాము తదితరులు ఈ సేవ కార్యక్రమం చేపట్టారు. మార్టిన్, సంపత్, రవికాంత్, అడ్వొకేట్ తేజ, మాలికార్జున్, రమేష్, యాదగిరి, అరుణ్ సహాయ సహకారాలు అందించారు.

మరిన్ని వార్తలు