రాయదుర్గంలో విదేశీ భవన్‌!

29 Aug, 2017 02:58 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజధాని నగరంలో ‘విదేశీ భవన్‌’కొలువు దీరనుంది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నంబర్‌ 83/1లో మూడెకరాల స్థలాన్ని కేటాయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ఈ కార్యాలయాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు నిధులు విడుదల చేసిన ఆ శాఖ.. స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర సర్కారును అభ్యర్థించింది. దీనికి అనుగుణంగా రాయదుర్గంలో స్థలాన్ని సూచిస్తూ రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

డైరెక్టర్‌ శంకర్‌ స్టూడియోకు..
హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో అందు బాటులోకి రానుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్య మంలో తనదైన శైలిలో పోరాటం సాగించిన ప్రముఖ దర్శకుడు శంకర్‌.. స్టూడియో నిర్మాణ రంగంలో అడుగు పెడుతున్నారు. జై బోలో తెలంగాణ తదితర చిత్రాలను తెరకెక్కించిన శంకర్‌ అంటే ప్రత్యేక అభిమానం కనబరిచే సీఎం కేసీఆర్‌.. స్టూడియోకు అవసరమైన స్థలాలను ప్రతిపాదించమని టీఎస్‌ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడ సర్వే నం.149లో ఎనిమిది ఎకరాలను కేటాయించేం దుకు టీఎస్‌ఐఐసీ సూత్రప్రాయంగా అంగీకరిం చింది. అలాగే, ఖానామెట్‌లోని సర్వే నం.41/14 లో నుంచి పదెకరాలను ప్రతిపాదిస్తూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. ఇప్పటివరకు జంట నగరాల్లోని సినీ స్టూడియోలన్నీ ఇతర ప్రాంతాల వారివే ఉన్న దృష్ట్యా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన వెన్నంటి నిలిచిన శంకర్‌ను ఈ రకంగా గౌరవిం చాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు