ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!

22 Feb, 2019 08:10 IST|Sakshi

 అబ్బాయి 5.4 అడుగులు  

అమ్మాయి 3.2 అడుగులు  

ముషీరాబాద్‌లో ఆదర్శ వివాహం

సాక్షి, హైదరాబాద్‌ ‌: వాళ్ల వివాహం ఆదర్శంగా నిలిచింది. అబ్బాయి ఎత్తు 5.4 అడుగులు, అమ్మాయి ఎత్తు 3.2 అడుగులు... వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఆదర్శ జంటగా నిలిచారు. ముషీరాబాద్‌లోని హెరిటేజ్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌ ఈ వేడుకకు వేదికైంది. గురువారం రాత్రి 8గంటలకు బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వరుడు చిదురాల విద్యాసాగర్‌ (25)ది సిద్దిపేట. తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి మృతి చెందడంతో కొంతకాలంగా అక్క దగ్గరే ఉంటూ పీజీ పూర్తి చేశాడు.

ఇక పెళ్లి కుమార్తె వీరవల్లి రవళి (22). తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మ. వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం. రవళికి ఒక సోదరుడు ఉండగా, వీరిద్దరూ మరుగుజ్జులే. రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతోంది. వధూవరులు ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఇల్లరికం రావాలని కోరగా వరుడు ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.    

మరిన్ని వార్తలు