నిధులపై నిఘా

15 Oct, 2014 02:43 IST|Sakshi
నిధులపై నిఘా

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్రంలో 16వ లోకసభ కొలువుదీరిన నేపథ్యం లో జిల్లాలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విడుదలయ్యే కేంద్ర ప్రభుత్వ నిధులపై ఈ కమిటీ నిఘా పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన పథకాలను ఈ కమిటీ పకడ్బందీగా పర్యవేక్షించనుంది. 15వ లోకసభ రద్దు చేయడం ద్వారా గతంలో ఉన్న విజిలెన్స్, మానిటరింగ్ కమిటీకి కాలం చెల్లిం ది. సార్వత్రిక ఎన్నికలు, ప్రభు త్వాల ఏర్పాటు, పదవీ ప్రమాణ స్వీకారాలు పూర్తయి పాలన ఊపందుకుంది. ఈ క్రమంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒక్కొక్కటిగా అధికారిక కార్యక్రమాలు, క మిటీల పునరుద్ధరణ జరగుతోంది.

సభ్యుల నియామకం
జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఇటీవలే ఆదేశించింది. స్పందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కమిటీలను ఖరా రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మన జిల్లా కమిటీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చైర్‌పర్సన్గా నియమితుల య్యారు. కో-చైర్మన్‌గా జహీరాబాద్ ఎంపీ భీంరావు బస్వంత్ రావు పాటిల్ వ్యవహరించనున్నారు. కలెక్టర్ రోనాల్‌రోస్ గౌర వ సభ్యులుగా ఉంటారు. శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, గంప గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేము ల ప్రశాంత్‌రెడ్డి,     మహ్మద్ షకీల్ సభ్యులుగా ఉంటారు.

ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి తది తరులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు, సీఈఓ రాజారాం, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారావు, త పాలశాఖ సీనియర్ సూపరింటెం డెంట్‌తోపాటు, జిల్లాలోని 36 మం ది ఎంపీపీలు సైతం ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే కమిటీ పని చేస్తుంది.

మరిన్ని వార్తలు