రూ. 263 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ

12 Dec, 2016 14:56 IST|Sakshi
రూ. 263 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ

మంత్రులు ఈటల, తలసాని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్: విజయ డెరుురీని రూ.263 కోట్లతో ఆధునీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సచివాలయంలో మంగళ వారం పశుసంవర్థక అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ఈటల, తలసాని మాట్లాడుతూ... ప్రైవేటు డెరుురీ ల కన్నా విజయ డెరుురీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు నూతన పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న కేంద్రాల సామర్థ్యం పెంచుతామన్నారు. ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు పలు చోట్ల ఔట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో పెరుగు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

సంచార వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు
రైతుల ఇంటి వద్దకే వెళ్లి పశు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశు వైద్య శాలల సేవలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 కోట్ల చేప పిల్లలను ఉచితంగా రిజర్వాయర్లు, చెరువుల్లో విడుదల చేశామన్నారు. ఈ నెలాఖరుకు చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. చేపల విక్రయానికి అవసరమైన స్థలాలను సేకరిస్తే మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సభ్యత్వం కలిగిన ప్రతీ మత్స్యకారుడు, గొర్రెల పెంపకం దారుడికి రూ. 5 లక్షల బీమా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, టీఎస్‌ఎల్‌డీఏ చైర్మన్ రాజేశ్వర్‌రావు, విజయ డెరుురీ ఎండీ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు