అమెజాన్‌ ద్వారా  ‘విజయ’ పాలు

22 Feb, 2019 00:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయ పాల పదార్థాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. బిగ్‌బాస్కెట్‌ డైలీ, ఫ్లిప్‌కార్ట్, సూపర్‌ డైలీ వంటి ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా ఇప్పటికే అమ్మకాలు సాగుతుండగా.. వచ్చేనెల నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌లోనూ లభ్యం కానున్నాయి. ‘అమెజాన్‌ నౌ’ ద్వారా విజయ పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల పదార్థాలు అందుబాటులోకి రానున్నాయని పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ‘సాక్షి’కి తెలిపారు.

ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఎలాంటి అదనపు కమీషన్‌ లేకుండా వినియోగదారులకు ప్రస్తుత ధరకే పాలు, పాల పదార్థాలు ఇంటి ముంగిటకు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో దీన్ని అమలు చేస్తున్నామని, త్వరలో ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. హోటళ్ల నుంచి ఆహారం, ఇతర తినుబండారాలు సరఫరా చేసే స్విగ్గీ సంస్థతోనూ ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నామని విజయ డెయిరీ మార్కెటింగ్‌ వింగ్‌ ఇన్‌చార్జి అరుణ్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు