హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి

2 May, 2020 02:39 IST|Sakshi

రాష్ట్రపతి ఆమోదముద్ర.. ఉత్తర్వులు జారీ

నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

నేడు ప్రమాణ స్వీకారం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి నియమితుల య్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. శనివారం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌.. విజయసేన్‌ రెడ్డితో న్యాయమూర్తిగా ప్రమాణం చేయించ నున్నారు. విజయ్‌సేన్‌రెడ్డిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ గత నెల 20న సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. విజయ్‌సేన్‌రెడ్డి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది.

ఇదీ ఆయన నేపథ్యం..
విజయ్‌సేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరా బాద్‌లో జన్మించారు. తండ్రి జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి, తల్లి రత్న. జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయ మూర్తిగా, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా, ఉమ్మడి ఏపీ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా, తెలంగాణ, ఏపీ లోకా యుక్తగా బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్‌సేన్‌రెడ్డి పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1994 డిసెంబర్‌ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. అన్ని స్థాయి కోర్టుల్లోనూ కేసులు వాదించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన కేసులతోపాటు సివిల్, క్రిమినల్‌ కేసుల్ని వాదించడంలో పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన వద్ద 20 మంది జూనియర్లు ఉన్నారు. క్రీడలపట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం 

మరిన్ని వార్తలు