కూలీ కంటే.. కోల నయం.. 

18 Nov, 2018 15:39 IST|Sakshi

 రోజుకు రూ.500 వరకు సంపాదన

పెద్దపల్లి: ప్రస్తుతం పత్తి ఏరేందుకు వెలితే రూ. 150 కూలి ఇస్తుండ్రు. అది కూడ ఉదయం 9గంటలకు వెళితే సాయంకాలం 5గంటలకు తిరిగిరావాలి. పొద్దంతా నడుం వంచి  పనిచేస్తే కాని పత్తి ఏరలేని పరిస్థితి. ఈ ఆవస్థ కంటే గ్రామానికి వచ్చే రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి కోలలు వాయిస్తే రూ. 300వరకు దొరుకుతున్నాయి. ఊళ్లల్లోనే రెండు, మూడు గంటలు కోలాలు వాయిస్తే ఉపాధి దొరుకుందని మహిళలంతా కోలాల వాయింపు వైపే ఆసక్తి చూపుతున్నారు.   

మరిన్ని వార్తలు