ఉరి తీయాలి

1 Dec, 2019 08:13 IST|Sakshi

ప్రియాంక హత్యపై జనాగ్రహం 

కోర్టులో శిక్షపడిన సామాన్య జనానికి తెలవదు 

మృగాళ్లు చేసిన పనికి గ్రామాలకు చెడ్డపేరు 

రోడ్డెక్కిన ప్రజా సంఘాలు, మహిళలు, విద్యార్థులు 

మరికల్, మక్తల్, జక్లేర్‌లో రాస్తారోకోలు 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు

నారాయణపేట/ మక్తల్‌: మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు నిర్భయ, ఫోక్సో చట్టాలు వచ్చినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుందంటూ ప్రజా, విద్యార్థి సంఘాలు, మహిళలు, విద్యార్థులు, జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రధాన హైవే ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గరలో హైవే పెట్రోలింగ్‌ తిరిగే ప్రాంతంలో ప్రియాంకను నలుగురు మృగాళ్లు ఇంత దారుణంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రియాంక హత్య ఘటనలో ప్రజల తీర్పుతో నిందితులను శిక్షిస్తూ వారి ఊళ్లోనే జనం కళ్లముందు ఉరితీయాలని, కాల్చేయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. 

రహదారిపై రాస్తారోకో 
ప్రియాంకరెడ్డిని హత్య చేసిన నిందితులను కఠి నంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ప్రధాన నిందితుడైన మహ్మద్‌ పాషా అలియాస్‌ ఆరిఫ్‌ స్వగ్రామమైన మక్తల్‌ మండలం జక్లేర్‌లో ప్రధాన రహదారిపై, మరికల్, మక్తల్‌ పట్టణా ల్లో ప్రజా, విద్యార్థి సంఘాలు, మహిళల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ హత్యకు పా ల్పడిన ఆ నలుగురు పెద్దగా ఏమీ చదువుకోలేదని, లారీ డ్రైవర్‌గా, క్లీనర్‌గా పనిచేస్తూ జు లాయిగా తిరుగుతూ ఇలాంటి దారుణానికి పా ల్పడిన వారిని వదలొద్దంటూ నినదించారు. ఎ వరైతే తప్పు చేస్తారో ఆ శిక్షను సొంత గ్రామస్తుల కళ్లముందు పడేలా చేస్తే భయం పుట్టుకొస్తుందని పలువురు డిమాండ్‌ చేశారు. 

గ్రామాలకు చెడ్డపేరు 
జులాయిగాళ్లు చేసిన పాడుపనులకు గ్రామాలకు చెడ్డపేరు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నామని గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా పిల్లను ఇవ్వాలన్నా.. పిల్లను తీసుకుపోవాలన్నా ఆ ఊరా అనే మచ్చపడిందని వాపోయారు. చట్టాలను గ్రామాల్లో అమలు చేయడంతో మహ్మద్‌పాషా చేసిన పనికి పడే శిక్షపడుతుందని భయం జనంలో ఉంటుందన్నారు. 

గలీజు గాళ్లయ్యారు.. 
మహ్మద్‌పాషా మోటార్‌ ఫీల్డ్‌కు వెళ్లిన తర్వాతనే గలీజు పనులకు అలవాటుపడ్డాడంటూ గ్రామస్తులు ఆరోపించారు. అప్పుడప్పుడు గ్రామంలో సైతం మద్యం మత్తులో చెడుగా ప్రవర్తించేవాడన్నారు. పక్కనే ఉన్న గుడిగండ్లకు చెందిన నవీన్‌కుమార్, శివ, చెన్నకేశవులతో దోస్తాన్‌ చేశాడని, నలుగురు మోటార్‌ ఫీల్డ్‌కి వెళ్లడం, కలిసి తిరగడం, ఏది చేసినా కలిసి చేయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. 

>
మరిన్ని వార్తలు