పల్లె జనమే ఘనం

12 Sep, 2017 13:31 IST|Sakshi
పల్లె జనమే ఘనం

10 కొత్త జిల్లాల్లో 85 శాతానికి మించి గ్రామీణ జనాభా.. 
తేల్చిన ‘మన జిల్లా– మన ప్రణాళిక’
4 జిల్లాల్లో 90% పైగా గ్రామీణ జనాభా


నాలుగు జిల్లాల్లో 90 శాతానికిపైగా గ్రామీణ జనాభా ఉండగా, పది జిల్లాల్లో 80 నుంచి 90 శాతం మధ్యలో ఉంది. 8 జిల్లాల్లో 70 నుంచి 80 శాతం గ్రామీణ జనాభా ఉంది. 50 నుంచి 70 శాతం మధ్యలో ఐదు జిల్లాలు, రెండు జిల్లాల్లో 30 నుంచి 50 శాతం మధ్యలో గ్రామీ ణ జనాభా ఉంది. ఒక జిల్లాలో 10 శాతంలోపే గ్రామీణ జనాభా ఉండడం గమనార్హం.

ఆదిలాబాద్‌ నుంచి గొడిసెల కృష్ణకాంత్‌గౌడ్‌ :
రాష్ట్రంలో 61.12 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 38.88 శాతం పట్టణ జనాభా ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనే గ్రామీణ జనాభా అధికంగా కనిపిస్తున్నది. పాత జిల్లాల్లో గ్రామీణ జనాభా పట్టణాలకు విద్య, వ్యాపారం, ఇతరత్రా పనుల నిమిత్తం వలస వచ్చి అక్కడే ఉండిపోవడంతో పట్టణ జనాభా పెరిగింది. హైదరాబాద్‌ మినహాయిస్తే రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ‘మన జిల్లా మన ప్రణాళిక’ ప్రకారం గ్రామీణ జనాభా ఈ విధంగా ఉంది.

పట్టణ జనాభా
అధికంగా ఉన్న జిల్లాల్లో మేడ్చల్‌ మొదటి స్థానంలో ఉంది. రంగారెడ్డి, హైదరా బాద్‌ జిల్లాలకు సమీపంలో ఉండడంతో అక్కడ అధిక జనాభా ఉంది.

కొన్ని కొత్త జిల్లాలు.. పట్టణ జనాభా అధికం..
వరంగల్‌ అర్బన్‌ గతంలో పాత వరంగల్‌ జిల్లా కేంద్రంగా ఉండ డంతో అక్కడ పట్టణ జనాభా అధికంగా ఉందని చెప్పవచ్చు. 8వ స్థానంలో కరీంనగర్, 9వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లాలు ఉండ గా, కొత్త జిల్లాగా ఏర్పడిన మంచిర్యాల ఆ రెండు జిల్లాల కంటే ముందు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. ప్రధానంగా సింగరేణి గనులతో ఉండడంతో అక్కడ పారిశ్రామికంగా ఇదివరకే అభివృద్ధి జరగడంతో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది. మెదక్‌ పాత జిల్లా అయినప్పటికీ ఇక్కడ పట్టణ జనాభా కేవలం 7.67 శాతం మాత్రమే. మెదక్‌ జిల్లా అయినా సంగారెడ్డిలో జిల్లా కార్యాలయాలు ఉండడంతో అక్కడ పట్టణీకరణ జరిగింది. దీంతో సంగారెడ్డి జిల్లా పట్టణ జనాభాలో 6వ స్థానంలో ఉంది.

జనసాంద్రత
జనసాంద్రత విషయంలో ప్రతి చదరపు కిలో మీటర్‌కు హైదరా బాద్‌లో 18,172 మంది, మేడ్చల్‌ జిల్లాలో 2,151 మంది, వరంగల్‌ అర్బన్‌లో 826, రంగారెడ్డిలో 486, కరీంనగర్‌ జిల్లాలో 473తో మొదటి ఐదు స్థానాల్లో ఉండగా, కొమురంభీం జిల్లాలో 106, జయశంకర్‌ 115, నాగర్‌కర్నూల్‌ 124, భద్రాద్రి 143, ఆదిలాబాద్‌  జిల్లాలో 171 మందితో చివరి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు