‘ఎవరూ చనిపోవద్దు.. అంతిమంగా విజయం మనదే’

25 Oct, 2019 19:31 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఉస్మానియా విద్యార్థులే కారణమనే సంగతి సీఎం కేసీఆర్‌ మరిచిపోయినట్లు ఉన్నారని ప్రజా గాయకురాలు విమర్శించారు. ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నారో, ఆనాడో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడన్నారు. అసలు కేసీఆర్‌ది నోరా.. తాటిమట్టా అంటూ విమలక్క మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచినందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేసీఆర్‌ తన నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందన్నారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ విభాగం శుక్రవారం సంఘీభావ సభ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా మాట్లాడిన విమలక్క.. ‘ఆర్టీసీ కథ ముగియదు.. కేసీఆర్‌ నువ్వ ఖతం అవుతావ్‌. ప్రజలు పెట్టిన భిక్షతోనే నువ్వు సీఎం అయ్యావ్‌. నువ్వు సీఎం అయ్యాక పోలీసుల రిక్రూట్‌మెంట్‌ తప్ప ఏ రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. ఆర్టీసీ ఎప్పట్నుంచో ఉంది. కార్మికుల చేసే సమ్మెలో న‍్యాయం ఉంది. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెపై హైకోర్టు స్పందించింది. కోర్టు ధిక్కరించిన వారికి గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో,.. ఇప్పుడు కేసీఆర్‌కు కూడా అదే పరిస్థితి రావాలి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా అందరూ రోడ్డు మీదకు రావాలి. ఇది ఉద్యమాల గడ్డ.. పోరాటల గడ్డ. కార్మికులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కార్మికులు ఎవరూ చనిపోవద్దు.. అంతిమంగా మనదే విజయం’ అని విమలక్క పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు