విన్యాసం..విస్మయం

30 Oct, 2014 04:19 IST|Sakshi
విన్యాసం..విస్మయం

మహబూబ్‌నగర్ క్రీడలు: స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం యోగా పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా మినహా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల బాల, బాలికలు పోటీలకు హాజరయ్యారు. మొదట అండర్ 8-11 విభాగంలో బాల, బాలికలకు పోటీలు నిర్వహించారు. వీరితో సర్వాంగాసనం, గర్భాసనం, పద్మాసనం, పచ్చిమోర్‌తండాసనం, ఏకపాదాసనం, అండర్ 11-14 కుక్కుటాసనం, మయూరాసనం, పాదంగుస్థనాస నం, పూర్ణచక్రాబంధాసనాలను వేరుుం చారు.

అండర్ 14-17 విభాగంలో వీరభద్రాసనం, కౌటిన్యాసనం, పాదంగుస్థనాసనం, పద్మాసనాలు నిర్వహించారు. బాల, బాలికల విన్యాసాలను బట్టీ రెఫరీలు మార్కులు వేశారు. అండర్ 8-11 చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు పలువురిని అబ్బురపరిచాయి.  

 యోగా పోటీలకు విశేష స్పందన
 - జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు రాములు

 జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి యోగా పోటీలకు విశేష స్పందన లభిస్తున్నదని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు, స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ కె.రాములు అన్నారు. టీటీడీ కల్యాణ మండపంలో జరుగుతున్న పోటీలను ఆయన సందర్శించారు. క్రీడాకారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరారు.

మరిన్ని వార్తలు