వ్యాధుల ఉచ్చులో బాల్యం

24 Jun, 2018 14:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పరకాలరూరల్‌ : చదువుపై శ్రద్ధపెట్టి బంగారు భవితకు బాటలు వేసుకోవాల్సిన వయస్సులో విద్యార్థులను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా యి. 18 సంవత్సరాలలోపు పిల్లలు తెలియకుం డానే పలు వ్యాధుల బారిన పడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో పలు ఆందోళనకర విషయాలు వెలుగు చూసాయి. ప్రధానంగా పుట్టుకతో వచ్చిన వ్యాధులను గుర్తిం చక పోవడం, వాటిపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పద్దెనమిదేళ్ల లోపు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారు ఎదుర్కొం టున్న ఆరోగ్య సమస్యలను గుర్తించడంతోపాటు ప్రాథమిక దశలోనే వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఆర్‌బీఎస్‌కేను ఏర్పాటు చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వైద్య శిబిరా లు నిర్వహించి విద్యార్థులకు ఉన్న ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తున్నా రు. ఏడాదిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రెండు సార్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగాఆరు టీంలు
జిల్లాలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట క్లస్టర్లు ఉండగా ప్రతి క్లష్టర్‌కు రెండు టీంల చొప్పున మొత్తం ఆరు టీంలు ఉన్నాయి. ప్రతి టీంలో ఇద్దరువైద్యాధికారులు(మేల్, ఫిమేల్‌), 
ఒక ఫార్మసిస్ట్, ఇద్దరు ఏఎన్‌ఎమ్‌లు ఉంటారు. వీరు వాహనాల్లో పాఠశాలలు తిరుగుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వారిలో అనారోగ్య సమస్యలను గుర్తించి వాటి తీవ్రత ఆధారంగా స్థానిక పీహెసీకి, సీహెచ్‌సీకి, డిస్ట్రిక్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌(డీఈఐసీ)కు రిఫర్‌ చేస్తారు. 

96,536 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 96,536 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 867 అంగన్‌వాడీ కేంద్రాల  పరిధిలోని ఆరు వారాల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలు 31,159 మంది, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న 18 ఏళ్లలోపు విద్యార్థులు 65,377 మంది ఉన్నారు. అంగన్‌వాడీ పిల్లల్లో 1,640, స్కూళ్లు, కళాశాలల్లో 3,895 విద్యార్థులు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కువగా చర్మ, దంత సమస్యలతోపాటు వినికిడి, నేత్ర, గుండె సం బంధ వ్యాధులతో బాధపడుతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందకపోవడం, పుట్టుకతో వచ్చిన వ్యాధులను గుర్తించకపోవడం, సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి.

ఆర్‌బీఎస్‌కేతో విద్యార్థులకు ప్రయోజనం
గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే పిల్లలు పేద, మధ్య తరగతికి చెందినవారే కాబట్టి ఆరోగ్య సమస్యలపై అవగాహన చాలా తక్కువ. దీంతో సమస్యలు జఠిలమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఆర్‌బీఎస్‌కే వైద్య సేవలలో భాగంగా వైద్య శిబిరాల ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించడంతోపాటు చికిత్స సైతం ఉచితంగా అందిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థుల కు ప్రయోజనం చేకూరుతోంది. 

ఆదిలోనే చికిత్స..
ఆర్‌బీఎస్‌కే ద్వారా విద్యార్థుల ఆరోగ్య సమస్యల కు ఆదిలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలను నమోదు చేయడం వల్ల సమస్యలపై అవగాహన రావడంతోపాటు పలు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతోంది. ఈ విద్యా సంవత్సరానికి గాను త్వరలోనే వైద్య శిబిరాలు ప్రారంభిస్తాం. 
– డాక్టర్‌ సుధీర్, ఆర్‌బీఎస్‌కే జిల్లా ఇన్‌చార్జి  

మరిన్ని వార్తలు