ఫీవర్‌కు పెరుగుతున్నరోగుల తాకిడి

4 Sep, 2019 11:51 IST|Sakshi

జ్వరాలపై ఆందోళన వద్దు

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌

నల్లకుంట: విష జ్వరాలతో వస్తున్న రోగులతో నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. గత రెండు వారాలుగా రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక చర్యలు తీçసుకుంటున్నారు. రద్ధీ కనుగుణంగా ఓపీ విభాగంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఓపీలో ఇబ్బందులు తలెత్తకపోయినా రక్త పరీక్షల ల్యాబ్, ఫార్మసీ కౌంటర్ల వద్ద రోగులు క్యూలైన్‌లో బారులు తీరాల్సి వచ్చింది.

జ్వరాలన్నీ డెంగీ కాదు
గాలిలో తేమ కారణంగా వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నాయి. జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందవద్దు. పలువురు డెంగీ భయంతో జ్వరం రాగానే ఫీవర్‌కు పరుగులు తీస్తున్నారు. జ్వరాలన్నీ డెంగీ కాదు. కాచి. చల్లార్చి వడ కట్టిన నీటినే తాగాలి. వ్యక్తిగత పరిశుభ్రతలతో చాలా వరకు వ్యాధులను నివారించవచ్చు. రోగుల తాకిడికి అనుగుణంగా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశాము. మందుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ల్యాబ్‌ వద్ద రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాం. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాము.– డాక్టర్‌ కె. శంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు