గాలి బలంగా వీచి.. బస్సును వెనక్కి నెట్టి..

18 May, 2020 09:22 IST|Sakshi

సాక్షి, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బలంగా వీచిన ఈదురు గాలులు ఏకంగా ఓ బస్సునే వెనక్కు నెట్టేశాయి. శనివారం సాయంత్రం ఈదురు గాలుల ప్రభావంతో పట్టణ శివారులో మారుతి రెస్టారెంట్‌ సమీపంలో పార్కింగ్‌ చేసిన ఓ ప్రయివేట్‌ బస్సు కదులుకుంటూ వెనక్కి వెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది దూరం మేర బస్సు గాలి తాకిడికి  100 మీటర్ల మేర  వెనక్కి వెళ్లిన దృశ్యాలు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు