వైరస్‌ దండయాత్ర ఇలా..

22 Mar, 2020 02:07 IST|Sakshi

కరోనా వైరస్‌ బయటి పొర కొవ్వులతో తయారై ఉంటుంది. అక్కడక్కడా ముళ్ల వంటి స్పైక్‌ ప్రొటీన్లు ఉంటాయి. వైరస్‌ మధ్యభాగంలో ఉండచుట్టుకుపోయిన జన్యుపదార్థం (ఆర్‌ఎన్‌ఏ) ఉంటుంది. ఊపిరితిత్తి కొమ్మపై పెరిగిపోయిన వైరస్‌లు నెమ్మదిగా శ్లేష్మం (మ్యూకస్‌) ద్వారా శరీర కణాలకు అతుక్కుపోతాయి. వైరస్‌ల కంటే బాగా పెద్దసైజులో ఉండే కణాలు వైరస్‌లను అడ్డుకునే ఏర్పాట్లు ఉన్నా.. ఓ చిన్న లోపమూ ఉంటుంది. కణాలపైన పొడుచుకుని బయటకు వచ్చి ఉండే ఏస్‌–2 రిసెప్టర్లకు కరోనా వైరస్‌ అతుక్కుపోతుంది. ఈ దశలోనే వైరస్‌ తాలూకు ఆర్‌ఎన్‌ఏ కణంలోకి చేరిపోతుంది. దీంతో వైరస్‌ దండయాత్ర మొదలవుతుంది!

మరిన్ని వార్తలు