మెడికల్‌ కాలేజీలకు విజిటింగ్‌ ఫ్యాకల్టీగా ప్రముఖ వైద్యులు

28 Dec, 2019 08:43 IST|Sakshi

ప్రముఖ ప్రైవేటు వైద్యులను నియమించుకునే వీలు 

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం 

విదేశీ డాక్టర్లనూ తీసుకునే వెసులుబాటు 

ఇటు వైద్య విద్యలో నాణ్యత.. అటు కాలేజీలకు ప్రతిష్ట 

సాక్షి, హైదరాబాద్‌
► డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి.. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్‌గా ఉన్నారు. అనేక అంతర్జాతీయ మెడికల్‌ సంస్థల్లో సభ్యులుగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్యం అంతర్జాతీయ వైద్య వేదికలపై ప్రసంగిస్తుంటారు. అధునాతన వైద్యరంగంలో నూతన పంథాలను ప్రవేశపెట్టారు. 
 డాక్టర్‌ సోమరాజు.. కేర్‌ వ్యవస్థాపకుడు. వైద్య రంగంలో ఎంతో అనుభవం గడించారు. ప్రొఫెసర్‌గా సేవలందించారు. అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని అందించారు. అంతర్జాతీయస్థాయిలో వైద్య వేదికలపై సెమినార్లు ఇచ్చారు. 
 డాక్టర్‌ గురువారెడ్డి.. సన్‌షైన్‌ వ్యవస్థాపకుడు. వైద్యరంగంలో వచ్చిన అనేక మార్పులను అందిపుచ్చుకొని ఆసుపత్రిని తీర్చిదిద్దారు. దేశవిదేశాల్లో వైద్యరంగంలో వచ్చిన మార్పులు ఒడిసిపట్టుకున్నారు. 

ఇలాంటి ప్రముఖులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అధునాతన వైద్య పరిజ్ఞానా న్ని, పరికరాలను తమ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా వచ్చే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు విజిటింగ్‌ ఫ్యాకల్టీగా వీరే బోధిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)కు చెందిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ) ఆచరణలోకి తెచి్చంది. ఈ మేరకు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులను ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ‘విజిటింగ్‌ ఫ్యాకలీ్ట’గా నియమించుకునే వెసులుబాటు కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండే ప్రముఖ వైద్యులను కూడా నియమించుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో మెడికల్‌ కాలేజీల్లో విజిటింగ్‌ ఫ్యాకల్టీ అనే అంశం లేదు. 30 ఏళ్ల క్రితం విజిటింగ్‌ ఫ్యాకల్టీ వ్యవస్థ ఉండగా, దాన్ని ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టారు. ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ విజిటింగ్‌ ఫ్యాకలీ్టని నియమించుకోవచ్చు, కానీ ఈ నియామకం ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల సంఖ్యలో 50 శాతానికి మించకూడదు. 

పెరగనున్న ప్రతిష్ట.. 
రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిల్లో ఎంబీబీఎస్‌ సీట్లు 4,790 ఉండగా, పీజీ మెడికల్‌ సీట్లు 1,400 ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2,358 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా, 1,051 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 1,307 ఖాళీలున్నాయి. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పరిస్థితి  దారుణంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో చాలాచోట్ల బోధనా సిబ్బంది సామర్థ్యంపై విమర్శలున్నాయి. రోజువారీ వైద్యరంగంలో వస్తున్న మార్పులను, అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవట్లేదన్న విమర్శలున్నాయి. దీంతో వైద్య విద్య నాసిరకంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని మెడికల్‌ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు.

దీంతో ప్రముఖ ప్రైవేటు వైద్యులను విజిటింగ్‌ ఫ్యాకలీ్టగా తీసుకుంటే ఆయా కాలేజీల్లో వైద్య బోధన మెరుగుపడుతుందని ఎంసీఐ ఉద్దేశంగా చెబుతున్నారు. ప్రముఖ వైద్యుల పేర్లను ఆయా కాలేజీల వెబ్‌సైట్లలో పెట్టడం ద్వారా వాటి ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్నారు. నెలకు నాలుగు క్లాసులు, ఒక్కో క్లాసు మూడు గంటలు ఉండేలా చేయాలని బీవోజీ నిర్ణయించింది. విజిటింగ్‌ ఫ్యాకలీ్టకి ఎంత పారితోíÙకం ఇవ్వాలనేది ఆయా కాలేజీల ఇష్టానికే వదిలేశారు. విజిటింగ్‌ ఫ్యాకల్టీ తప్పనిసరిగా పీజీ పూర్తి చేసి, సంబంధిత స్పెషాలిటీలో కనీసం 8 ఏళ్లు అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలుగా నిర్ధారించారు. విజిటింగ్‌ ఫ్యాకల్టీని మొదట ఏడాది కాలానికి నియమిస్తారు. తర్వాత మరో ఏడాది పొడిగించుకోవచ్చు. మెడికల్‌ కాలేజీ సీట్లను కాపాడుకోవడంలో విజిటింగ్‌ ఫ్యాకలీ్టని పరిగణనలోకి తీసుకోరు.

వైద్యవిద్య ప్రమాణాలు పెరుగుతాయి
ప్రైవేటు రంగంలో ప్రముఖులైన దేశ విదేశీ వైద్యులను మెడికల్‌ కాలేజీల్లో విజిటింగ్‌ ఫ్యాకలీ్టగా నియమించడం వల్ల వైద్యవిద్య నాణ్యత పెరుగుతుంది. అధునాతన పరిజ్ఞానాన్ని విద్యార్థులు, రెగ్యులర్‌ ఫ్యాకలీ్టకి కూడా అందించడానికి వీలవుతుంది. ఆయా మెడికల్‌ కాలేజీల ప్రతిష్ట కూడా పెరుగుతుంది. – డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య  విశ్వవిద్యాలయం 

ఎంతోమంది ప్రముఖులున్నారు
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వైద్య విద్య నాణ్యత మరింత పెరుగుతుంది. డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ శాంతారాం, డాక్టర్‌ మానస్‌ పాణిగ్రాహి, డాక్టర్‌ బాలాంబ వంటి ప్రముఖ వైద్యులు విజిటింగ్‌ ఫ్యాకల్టీగా వస్తే ఆయా స్పెషాలిటీల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన వైద్య విద్య అందించడానికి వీలు కలుగుతుంది. – డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ  

>
మరిన్ని వార్తలు