ఓటు వజ్రాయుధం (పాట)

27 Nov, 2018 08:59 IST|Sakshi


పల్లవి : ఓటమ్మా... నీకు దండమే 
 నా మాట వింటవా ఓటమ్మా 
 
చరణం 1 : 
ప్రజాస్వామ్యానికి నీవు  
ప్రతిరూపమే...ఓటమ్మా 
ఐదేళ్లకోసారి నీవు 
ఓట్ల పండుగై
వస్తున్నావÐమ్మా 
అందరినొకసారి 
పలుకరిస్తవే నీవు 
నీ పండుగైపోయాక 
మాటాడవెందుకే ఓటమ్మా
– ఓటమ్మా... నీకు 
 
చరణం 2 : 
రాముని చేతిలో బాణం..     
నీవమ్మా 
విష్ణు చేతిలో 
చక్రములే తిరుగుతున్నావు 
నోటుకు, మత్తుకు, 
కులాల కుంపట్ల మధ్య నీవు 
వజ్రాయుధమే నీవు ఓటమ్మా
అమ్ముడు పోకే ఓటమ్మా  
– ఓటమ్మా...నీకు 
 
చరణం 3 : 
అంబేద్కరూ కలం చేత నీవు 
జ్ఞానమై వెలిగిన ఓటమ్మా 
ఈ జగతిలో బ్రహ్మాస్త్రం నీవు 
ఓటేసే మహాశయులారా 
ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాము 
ఆలోచించి ఓటు వేయీ నీవు 
అప్పుడే ఓటమ్మా  ఎల్లకాలం ఉంటుంది
    – ఓటమ్మా...నీకు 
– పానుగంటి నాగన్న, జానపద కళాకారుడు, వెంకటాపురం, వనపర్తి  

మరిన్ని వార్తలు