ప్రజాస్వామ్యానికి ఓటే రక్ష

19 Nov, 2018 19:02 IST|Sakshi
వడ్డెపల్లి కృష్ణను సత్కరిస్తున్న సాహితీ సమితి సభ్యులు

సినీ దర్శకుడు వడ్డెపపెల్లి కృష్ణ

సిరిసిల్ల : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును మించిన ఆయుధం లేదని, రాజ్యాంగం ఇచ్చిన ఈఅవకాశాన్ని ఓటర్లు సద్వినయోగం చేసుకోవాలని ప్రముఖ లలిత గేయ కవి, సినీ దర్శకుడు వడ్డెపెల్లి కృష్ణ అన్నారు. ఆదివారం గాంధీనగర్‌ హనుమాన్‌ దేవాలయంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకుని నోటురూటు మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రతీపౌరుడు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాధ్యక్షుడు పొరండ్ల మురళీధర్‌ మాట్లాడుతూ మందుకో, విందుకో లొంగి ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతామన్నారు. 

అనంతరం సాహితీ సమితికి చెందిన పలువురు కవులు తమ కవితల్లో ఓటు ప్రాధాన్యతను వర్ణించారు. సమితి ప్రతినిధులు వడ్డెపెల్లి కృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జనపాల శంకరయ్య, కవులు, రచయితలు వెంగళ లక్ష్మణ్, వాసరవేణి పరుశరాం, మడుపు ముత్యంరెడ్డి, జక్కని వెంకట్రాజం, నేరోజు రమేశ్, సబ్బని బాలయ్య, వడ్నాల వెంకటేశం, పాముల ఆంజనేయులు, కనపర్తి హనుమాండ్లు, తుమ్మనపల్లి రామస్వామి, సిద్దిరాం, సత్యనారాయణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు