కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌కు ఓటేసి ఆత్మగౌరవాన్ని చాటాలి

4 Dec, 2018 14:48 IST|Sakshi
ఎలగందులలో మాట్లాడుతున్న గంగుల కమలాకర్‌

గ్రామాల అభివృద్ధికి మరో అవకాశమివ్వండి

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌

సాక్షి, కరీంనగర్‌రూరల్‌: రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలందరూ ఓట్లేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ మండలం నగునూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చావిడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమలాకర్‌ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నగునూరుకు పాతరోడ్డు, చెక్‌డ్యామ్, కాట్నెపల్లిరోడ్డు, ఎలబోతారం గ్రామాలకు రహదారుల నిర్మాణంతో రవాణాసౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీలు భద్రయ్య, చంద్రమ్మ, మాజీ సర్పంచులు కె. సుమలత, జె. సాగర్, పి.శ్రీనివాస్, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, డైరెక్టర్లు శ్రీధర్, నేక్‌ పాషా, కె.రాంరెడ్డి, శ్రీనివాస్‌రావు, దిలీప్, సంపత్, కె.శ్రీనివాస్, బి.గోపాల్‌రెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, ఎస్‌.సంపత్‌రావు, కె.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 


ప్రజలంతా ఏకమై టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి
తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో ఆంధ్రోళ్లు విషం చిమ్మే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రజలంతా ఏకమై టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కొత్తపల్లి మండలం ఎలగందులలో సోమవారం ఆయనకు మహిళలు మంగళహారతులు.. పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గంగుల మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్, బీజేపీ పార్టీల మోసపూరిత వాగ్ధానాలు నమ్మి మోసపోద్దని, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీని గెలుపించుకోవల్సిన ఆవశ్యకత ఉదన్నారు. లేకపోతే తెలంగాణను కుక్కలు చింపిన ఇస్తారిలా మార్చేందుకు ఆంధ్రోళ్లు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆచంపల్లి చెరువుపై నిర్మించిన వరద కాలువకు తూం ఏర్పాటు చేయకపోవడం వల్లనే నాగులమల్యాల, బావుపేట, ఎలగందుల, కమాన్‌పూర్, బద్ధిపల్లి గ్రామాల్లోని చెరువులు ఎండిపోయాయన్నారు. ఇక్కడి భూములు బీడుగా మారడానికి కాంగ్రెస్‌దే పాపమని విమర్శించారు. ఆచంపల్లి శివారులోని వరద కాలువపై నిర్మిస్తున్న ఫీడర్‌ చానల్‌ ద్వారా సంక్రాంతికి చెరువులు నింపకుంటే గ్రామాల్లోకి రానయ్యద్దని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కో డూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, వైస్‌ ఎంపీపీ నిమ్మల అంజయ్య, మాజీ సర్ప ంచ్‌ ప్రకాష్, నాయకులు చంద్రమౌళి, మంద రమేష్‌గౌడ్, శ్రీనివాస్, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు