జాబితాలో మీ పేరు లేదా.. అయినా ఓటేయొచ్చు

20 Mar, 2019 10:55 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఓటరు జాబితాలో మీ పేరు లేదా..? ఓటు ఎలా వేసేదని ఆందోళన చెందుతున్నారా..? అయినా మీరేమీ వర్రీ కావద్దు. పేరు లేకపోయినా ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఏఎస్‌డీ జాబితాలో మాత్రం మీ పేరు ఉండాల్సిందే. అందులో పేరు లేకపోతే మాత్రం ఏమీ చేయలేం. ఓటరు జాబితా తయారీకి ముందు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన సమయంలో ఇళ్లలో లేని వారి పేర్లు జాబితా నుంచి తొలగించి.. ఏఎస్‌డీ (ఆబ్సెంటీ, షిఫ్ట్‌డ్‌ అండ్‌ డూప్లికేటెడ్‌ ఓటర్స్‌) అనే మరో జాబితాలో పొందుపరుస్తారు. ఆ ఏఎస్‌డీ జాబితాలో పేరు ఉంటే అది మీరే అని నిరూపించుకుని ఓటు వేయవచ్చు.  
 

మరిన్ని వార్తలు