30న ఓటరు తుది జాబితా

4 Jul, 2017 03:31 IST|Sakshi
30న ఓటరు తుది జాబితా
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌
 
వేములవాడ: రాష్ట్రంలోని 83 నియోజకవర్గాల్లో 2017 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన యువత తుది ఓటరు జాబితాను ఈనెల 30న విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌ లాల్‌ తెలిపారు. ఇక నుంచి జియో ట్యాగింగ్‌ పరిధిలోకి అన్ని నివాసాల ను తీసుకొస్తామని, తద్వారా ఆ ఇంట్లో కొత్తగా ఎవరూ ఓటరుగా పేరు నమోదు చేసుకున్నా తెలిసిపోతుందని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

అర్బన్‌ ప్రాంతాల్లోని 36 నియోజకవర్గాల్లో బూత్‌లెవల్‌ ఆఫీసర్లతో ఇంటెన్సివ్‌ రివిజన్‌ పేరుతో ఇంటింటా సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. దీంతో 1.10 కోట్ల ఓటర్ల తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ విధానాన్ని గతంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని 28 నియోజకవర్గాల్లో పూర్తి చేశామన్నారు. ఇకనుంచి ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మరిన్ని వార్తలు