ఓటరు స్లిప్పు లేకుంటే.. గుర్తింపు కార్డు తప్పని సరి

5 Dec, 2018 08:50 IST|Sakshi
ఓటరు గుర్తింపు కార్డు

సాక్షి,మిర్యాలగూడ రూరల్‌ : శాసనసభ ముందస్తు ఎన్నికలు ఈ నెల 7న శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నారు. ఓటు వేయడానికి ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులను బీఎల్‌ఓల ద్వారా ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈ స్లిప్పులు లేకున్నా ఓటరు జాబితాలో తమ కార్డు నంబరు, పోలింగ్‌ బూతు నంబరు, ఓటరు క్రమ సంఖ్య తెలిసి ఉంటే తెల్లకాగితంపై రాసుకుని వెళ్లి ఎన్నికల సంఘం ఆమోదించిన ఆధార్‌కార్డుతో పాటు డ్రైవింగ్, పాన్‌కార్డు, ఉపాధిహామీ జాబ్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, పాస్‌పోర్టు లాంటి తదితర గుర్తుంపు కార్డులు  ఏ ఒక్కటి ఉన్నా చూపించి కూడా ఓటు వేయవచ్చు. పోలింగ్‌ బూతులో ఏజెంట్‌ అభ్యంతంరం తెలిపినపుడు వారిని సంతృప్తి పరిచే విధంగా రుజువు చేసుకోవలసి ఉంటుంది.

  • స్థానిక బూతులెవల్‌ అధికారి,గ్రామ రెవెన్యూ అధికారి నిర్ధారణ చేస్తారు. 
  • పోలింగ్‌ రోజు  సాయంత్రం  వరకు ఓటు వేయడానికి ఎంత పెద్ద వరుస ఉన్నా వారందరూ ఓటువేయడానికి అవకాశం కల్పిస్తారు.ఒక వేళ అవకాశం ఇవ్వక పోతే అక్కడి పరిశీలకులు లేదా టోల్‌            ఫ్రీ నంబర్‌ 1950 ఫిర్యాదు చేయవచ్చు.
  • మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక వరుసలు ఏర్పాటు చేస్తారు.  
  • అంధులు, శరీర దౌర్భల్యం గల వారిరు ఓటు వేయడానికి సహాయకులను తీసుకుపోవచ్చు. అయితే సహాయకున్ని ఒక ఓటుకు మాత్రమే అంగీకరిస్తారు.  మళ్లీ రాకుండా సహాయకుని                      కుడిచేతిచూపుడు  వేలుకు సిరా గుర్తు వేస్తారు. 
  • పోలింగ్‌ బూతులోనికి కెమరాలు, సెల్‌ ఫోన్లు అనుమతించరు. 
  • ఓటు వేయడానికి బహిరంగంగా డబ్బు ,బహుమతి, మద్యం తీసుకొన్న వారితో పాటు ,ఇచ్చిన వారిని అరెస్టు చేస్తారు. 
  • అభ్యర్థికి చెందిన వాహనంలో ఓటు వేయడానికి వచ్చిన అరెస్టు చేయవచ్చు.  
మరిన్ని వార్తలు