జాబితాలో సవరణకు అవకాశం

4 May, 2018 09:41 IST|Sakshi
ధరూరు, మాట్లాడుతున్న నరసింహనాయుడు

ధరూరు : ఓటరు లిస్టులో సవరణల కోసం ఈ నెల 8 వరకు అవకాశం ఉందని దానిని రాజకీయ పార్టీల నాయకులు సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి నరసింహనాయుడు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ మీటింగ్‌ హాల్‌లో అయిదో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు లిస్టులో తొలగింపు చేయాల్సి ఉందని, కొత్తగా చేర్చిన వారి జాబి జాబితాలో నమోదు కాలేదని నాయకులు ఎంపీడీఓకు విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎక్ట్రోరల్‌ అధికారి, లేదా డీపీఓలను కలవాలని సూచించారు.

మూడు చోట్ల ఓటు హక్కు.. 

మల్దకల్‌ : ప్రభుత్వం ఒక ఓటరు ఒకే చోట తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిబంధనలు విధించినప్పటికీ బీఎల్‌ఓల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కొన్ని గ్రామాల్లో ఒక ఓటరు మూడు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మండల అధ్యక్షుడు పాలవాయి రాముడు, బ్రహ్మోజిరావు, బంగి గోవిందులు ఆరోపించారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సూపరింటెండెంట్‌ రాజారమేష్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ఓటరు నమోదులో ఎలాంటి తప్పొప్పులు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జాబితాలో ఒక కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా ఎవరైనా వేర్వేరు చోట ఉన్నట్లు గుర్తించినా వెంటనే ఈ నెల 10లోపు తెలియజేయాలని సూచించారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓటరు జాబితాలో కొందరు ఓటర్ల పేర్లను బీఎల్‌ఓలు తొలగించకుండా అలాగే ఉంచారని, బీఎల్‌ఓలు కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ.. వారి అనుచరుల పేర్లు తొలగించడం లేదన్నారు. వివాహాలు చేసుకుని వెళ్లిన, గ్రామంలో నివాసం లేకుండా వెళ్లిన వారి పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ఉన్నాయని వాటన్నింటిని తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సవారమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు, నీలిపల్లి కృష్ణయ్య, కిశోర్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు