17న ‘వీఆర్‌–1’ రన్‌

15 Mar, 2019 11:28 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘మహిళల భద్రత మన అందరి బాధ్యత’ అనే నినాదంతో హైదరాబాద్‌ షీ టీమ్స్‌ నిర్వహించ తలపెట్టిన ‘వీఆర్‌–1’ రన్‌ ఈనెల 17న ఆదివారం పీపుల్స్‌ ప్లాజా కేంద్రంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ షీ టీమ్స్‌ ఇంచార్జ్, అదనపు పోలీసు కమిషనర్‌ శిఖా గోయెల్‌ గురువారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మహిళ భద్రతలో సిటీ పోలీసులు షీ టీమ్స్‌ తీసుకుంటున్న చర్యలతో దేశంలోనే హైదరాబాద్‌కు మహిళలకు రక్షణలో సురక్షితమైన నగరంగా గుర్తింపు వచ్చిందన్నారు. షీ టీమ్స్‌ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వీఆర్‌–1 రన్‌తో మహిళల భద్రత మన అందరి బాధ్యత అని గుర్తుచేయడంతో పాటు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ రన్‌లో పాల్గొనేందుకు భరోసా కేంద్రం, ఆన్‌లైన్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు  దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు నెక్లెస్‌ రోడ్డులో రన్‌ను రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభిస్తారన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి రేసు కిట్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు పాల్గొంటారన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక కదలాల్సిందే..

విద్యుత్‌ గోదాములో దొంగలు పడ్డారు

‘గాంధీ’లో దళారీ దందా

జగన్‌ సీఎం కావడం సంతోషంగా ఉంది: కోమటిరెడ్డి

ఓల్వోకు టికెట్లు తీసుకుంటే హైటెక్‌ బస్‌ ఏర్పాటు

వాహనం విక్రయించారా? అందుకు మీరే బాధ్యత

అదే నిర్లక్ష్యం..!

తల్లిదండ్రులూ ఇంగ్లిష్‌ నేర్చుకోవాలి

మంత్రులకు షాక్‌!

పాటల తోటకి ప్రాణాంతక వ్యాధి..

కరాటే క్వీన్‌

‘నందమూరి’కి జెండా అప్పజెప్పు 

రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

‘కేసీఆర్‌ నియంత పోకడలకు అడ్డుకట్ట’

ముగ్గురి జాతకాన్ని మార్చిన నోటామీట!

‘బీడీ ఆకుల’ అనుమతి నిరాకరణపై రిట్‌

తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు

ఫలితాలపై నేడు కాంగ్రెస్‌ సమీక్ష

ఓడినా నైతిక విజయం నాదే: కొండా

కేసీఆర్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చారు 

హరీశ్‌రావు చొరవతో స్రవంతికి ఆర్థిక సహాయం

రైతులకు నాణ్యమైన సోయా విత్తనాలు

కేంద్ర ఉద్యోగుల పథకమే మోడల్‌ 

వచ్చే నెల మొదటివారంలో ఎంసెట్‌ ఫలితాలు!

‘దోస్త్‌’ లేకుంటే రీయింబర్స్‌మెంట్‌ లేనట్లే..

ఉద్యోగుల చూపు బీజేపీ వైపు!

‘కాళేశ్వరం’లో పైప్‌లైన్‌కు రూ. 14,430 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాలకు చర్యలు

మేమే ప్రత్యామ్నాయం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’