పొత్తుల కోసం ఎదురుచూపులు

19 Mar, 2014 00:32 IST|Sakshi

 నర్సాపూర్, న్యూస్‌లైన్: స్థానిక జెడ్పీటీసీ స్థానం ఈసారి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ యా పార్టీల్లో పోటీ చేసేవారి సంఖ్య భా రీగా పెరిగింది. అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు సైతం ఇంకా ఖరారు కా లేదు. పొత్తులో భాగంగా ఈ స్థానం ఎవరికి దక్కుతుందో తెలియక ఆయా పారీ ్టల నాయకులు అయోమయానికి గురవుతున్నారు. అదే సమయంలో ఎవరికి వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్, సీపీఐ ముఖ్య నాయకులు ఇటీవల సమావేశమైనప్పటికీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు?, ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే విషయమై స్పష్టత రాలేదు.

 పొత్తులు కుదిరినా స్థానిక జెడ్పీటీసీ స్థా నం నుంచి టీఆర్‌ఎస్‌కు దక్కుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ తమకే కేటాయించాలంటూ నాయకులపై ఒత్తిడి కూడా పెంచుతున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్ నుంచి నర్సాపూర్ మాజీ సర్పంచ్ మురళీధర్ యాదవ్, మరో నాయకుడు మన్నె వీరేశం టికెట్ ఆశిస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయిం చినందున మురళీధర్ యాదవ్ నర్సాపూర్ స్థానం నుంచి తన భార్య నర్సాపూర్ మాజీ సర్పంచ్ రాజమణిని పోటీ లో నిలపాలని, తద్వారా జడ్పీ పీఠాన్ని కూడా దక్కించుకోవాలని చూస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, ఆత్మ మాజీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, రుస్తుంపేటకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లేశ్ జడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. సీపీఐ నుంచి జగదీశ్వర్, శివకుమార్‌లు టికెట్లు ఆశిస్తున్నట్టు సమాచారం.

 టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. ఇంకా అంగీకారానికి రాకపోవడంతో ఎవరికి వారు టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి అశోక్‌గౌడ్, బీజేపీ నుంచి రమేశ్‌గౌడ్‌లు పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వైఎస్సార్ సీపీ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ పార్టీ నుంచి కూడా పలువురు అభ్యర్థులు టికె ట్ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నా రు. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు గడిచినా ఇంకా ఏ పార్టీలోనూ అభ్యర్థులు ఖరారు కాలేదు. ప్రస్తుతానికి పొత్తు అంశం కొలిక్కి రానందున ఆయా పార్టీల నుంచి ఆశావహులతో నామినేషన్లు వేయించి ఆ తరువాత ఉపసంహరించేలా చూడాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు